మొన్నటి ఈనాడు లొ వచ్చింది ఒక వార్త, ఆల్లు అరవింద్, నాగబాబుల ఢిల్లి యాత్ర గురించి. ఇందు లోంచి ఒక్క పదం మాత్రం బాగా గుర్తుండిపొయింది నాకు. ఇది ఈ మధ్య వార్త పత్రికల్లొనూ ఇతర మాధ్యమాల్లొనూ తరచుగా వినిపిస్తూన్న పదం- ‘సామాజిక వర్గం’
కులం అన్న పదానికి పర్యాయ పదంగా విరివిగా వాడుతున్నారీ పదాన్ని.
మన రాజకీయాల్లొనూ, ఉద్యోగాల్లొనూ, ఇతరత్రా దైనందిన జీవితంలొనూ మనల్ని భూతంలా వెంటాడేదీ కులం. మన రాష్ట్రం లొ ఐతే సినిమాలు కూడా ఈ జాడ్యానికి అతీతాలు కాదు. ఇది మన దౌర్భాగ్యం.
ఇలాంటి పదానికి పర్యాయంగా ఇంకొ పదం వాడేసి దాని ప్రభావాన్నీ, ప్రాముఖ్యత ని ఏదొ తగ్గించినట్టు భావించేసుకొవడం మన హిపోక్రసీ కి నిజాయితి లేమి కి తార్కాణం.
నిజానికి ఇలాంటి పదాల్ని జార్గన్ ముసుగులొ దాచెయకుండ వీటిని యదాతధం గా వాడితేనే సమాజంలొ వీటికున్న, ఉండకూడని ప్రాముఖ్యతను గుర్తు చేసినట్టౌతుంది.
George Carlin రాసిన/ప్రదర్శించె Euphemisms గుర్తుకొస్తొంది నాకు
http://youtube.com/watch?v=h67k9eEw9AY&feature=related